లిల్లీ ఫుట్ల సభకు కేసీఆర్ రావాలా : జగదీశ్​ రెడ్డి

లిల్లీ ఫుట్ల  సభకు కేసీఆర్  రావాలా : జగదీశ్​ రెడ్డి
  • సబితక్కను చూసి వణికి పోతున్నరు
  • మీడియా పాయింట్‌ను కబ్జా చేసిండ్రు
  • సీఎం భాషతో రాష్ట్రంలో అల్లర్లు 
  • మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి 

హైదరాబాద్​: లిల్లీ ఫుట్స్ ఉన్న సభకు  కేసీఆర్  రావాలా అని మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి  అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు.  సభలో సబితక్కను చూసి  సీఎం రేవంత్​తో సహా మంత్రులు వణికి పోతున్నారన్నారు.   అసెంబ్లీలో ఇంగిత జ్ఞానం లేనట్టుగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉందన ఆయన ధ్వజమెత్తారు. మహిళ లోకం రేవంత్ రెడ్డి అరాచకం అంతా చూస్తోందన్ఆనరు.  దమ్ము ధైర్యం ఉంటే సబితా ఇంద్రారెడ్డికి రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సవాల్​ విసిరారు.  

అసెంబ్లీలో,  మీడియా పాయింట్లోనూ సబితక్కకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు.  తెలంగాణ మహిళలకు జరుగుతున్న అవమానంగా  బీఆర్ఎస్ భావిస్తోందన్నారు.  పథకం ప్రకారమే మీడియా పాయింట్ ను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. సీఎం భాషతో రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందన్నారు. నేరస్తులను పట్టుకోకుండా పోలీసులకు సీఎం అడ్డుపడుతున్నారన్నారు. 

శాసనాసభలో డప్పు కొట్టుకుంటే ప్రజలు నీ జుట్టు పట్టుకుంటారని సెటైర్​ వేశారు. సభలో ఒక్క మహిళకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే సభ హుందాతనం నిల్వదన్నారు. రైతు రుణమాఫిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్​విసిరారు. రైతులను రేవంత్ రెడ్డి దొంగల్లా చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను తిట్టడానికే మాత్రమే అసెంబ్లీ పెట్టి ఇంగిత జ్ఞానం లేక మాట్లాడుతున్నాడనన్నారు. తాగుబోతు మనిషిని  పట్టుకొచ్చి తనపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. ఆ చేతగాని వ్యక్తి పేరు తీయటం కూడా తనకు కు ఇష్టం లేదని ఆయన అన్నారు.