పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తు: కేటీఆర్

పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తు: కేటీఆర్

 సీఎం రేవంత్ రెడ్డికి నీటి కేటాయింపులపై  శ్రద్ధ లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్.  వేసవి ప్రారంభంలోనే తాగునీటి సమస్యలు మొదలయ్యాయని విమర్శించారు.  పల్లెల్లు,పట్టణాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉందన్నారు.  ప్రభుత్వ వైఫల్యం వల్లే వేసవిలో తాగునీటి కొరత ఏర్పడిందని విమర్శించారు. ఇది వచ్చిన కరువు కాదు..కాంగ్రెస్ తెచ్చిన కరువని ధ్వజమెత్తారు.   పార్టీ గేట్లు ఎత్తడం కాదు..ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు . ఫోన్ ట్యాప్ లు కాదు..వాటర్ ట్యాప్ లపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ఉపయోగించుకునే తెలివి ప్రభుత్వానికి లేదన్నారు.  

హైదరాబాద్ లో గత పదేళ్లుగా మంచి నీటి సమస్య లేదని..ఇపుడు మహిళలు బిందెలతో రోడ్డున పడ్డారని విమర్శించారు కేటీఆర్. ఉస్మాన్ సాగర్, హిమయాత్ సాగర్ లో నీళ్లున్నాయని..అయినా నీళ్లసమస్యను సృష్టించారని చెప్పారు. ఓటెయ్యలేదని  హైదరాబాద్ ప్రజలపై  సీఎం రేవంత్  కక్ష కట్టిండని విమర్శించారు.ఇవాళ  మూడు నాలుగు రెట్లు ఎక్కువ డబ్బులు పెట్టి వాటర్ ట్యాంకులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక్క హైదరాబాద్ లో  HMWSSB లో  లక్షా 30 వేల  ట్యాంకర్లు బుక్  అయ్యాయి తెలిపారు.

also read : రైతుబంధు పైసలు పదిరోజుల్లో ఎప్పుడేసినవ్ కేసీఆర్: కడిగిపారేసిన సీఎం రేవంత్

నాగార్జున సాగర్ లో నీళ్లున్నా ప్రభుత్వం వినియోగించుకోవడం లేదన్నారు కేటీఆర్. కాళేశ్వరంను  ఒక విఫల ప్రాజెక్టుగా చూపించడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు.  పనికి మాలిన రాజకీయాలు తప్ప ప్రజల కష్టాలు పట్టించుకోవడం  లేదని విమర్శించారు.నల్గొండలో  కేసీఆర్ పర్యటించిన కాసేపటికే నీళ్లు విడుదల చేశారని.. రిజర్వాయర్లలో నీళ్లు దాచిపెట్టి ఇన్నాళ్లు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు.  కాళేశ్వరంలో నీళ్లున్నా పంటలు ఎండిపోతున్నాయి..పంటలు పండితే ప్రభుత్వం బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కరువు సృష్టిస్తుందని ఆరోపించారు.