ఉద్యమంలో ముచ్చర్ల దిప్రత్యేక ముద్ర

ఉద్యమంలో  ముచ్చర్ల  దిప్రత్యేక ముద్ర

బషీర్​బాగ్, వెలుగు: కవిగా తన రచనల ద్వారా ప్రత్యేక  తెలంగాణ ఉద్యమంలో మాజీ మంత్రి ముచ్చర్ల సత్తన్న ప్రత్యేక ముద్ర వేశారని పలువురు వక్తలు అన్నారు. బుధవారం ముచ్చర్ల సత్తన్న 93వ జయంతిని తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంగంరెడ్డి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి, సినీ డైరెక్టర్ శంకర్, మన తెలంగాణ పత్రిక ఎడిటర్​ దేవులపల్లి అమర్, ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు, సీనియర్ జర్నలిస్ట్ విరహత్ అలీ, ఉద్యమ నాయకురాలు విమలక్క హాజరై సత్యన్న ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముచ్చర్ల సత్తన్న ఉమ్మడి ఏపీ మంత్రిగా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు  స్థానిక సమస్యలపై గళం విప్పారన్నారు. అప్పటి ఆధిపత్య ధోరణికి ధిక్కార స్వరం వినిపించారని చెప్పారు.