వైన్షాపుల్లో గౌడ్స్కు 25 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి : శ్రీనివాస్ గౌడ్

వైన్షాపుల్లో గౌడ్స్కు 25 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి :  శ్రీనివాస్ గౌడ్
  • కల్తీ సాకుతో కల్లు దుకాణాలు మూయడం సరికాదు
  • మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

బషీర్​బాగ్​,వెలుగు: కల్తీ సాకుతో కల్లు దుకణాలను పర్మినెంట్​గా మూసేయడం సరికాదని, వెంటనే ఆ షాపులను తెరవాలని బీఆర్​ఎస్​ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. శుక్రవారం గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం ఎదుట తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ, కల్లుగీత వృత్తిదారుల సంఘం నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా శ్రీనివాస్​గౌడ్​ మాట్లాడుతూ.. బార్, వైన్ షాపుల్లో కల్లు గీత సొసైటీ సభ్యులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.

 మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలన్నారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో బాలరాజ్ గౌడ్ , అయిలి వెంకన్న గౌడ్ , దామోదర్ గౌడ్, దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బైరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.