ఖమ్మం నుంచే తుమ్మల పోటీ?

ఖమ్మం నుంచే తుమ్మల పోటీ?
  • రాహుల్​గాంధీతో మాజీ మంత్రి కీలక భేటీ

ఖమ్మం, వెలుగు: కాంగ్రెస్​అగ్రనేత రాహుల్ గాం ధీతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అ య్యారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు రావ డంతో శనివారం ఆయన ఢిల్లీ వెళ్లారు. గత నెలలో పార్టీలో చేరిన టైమ్​లో కాంగ్రెస్​ వర్కింగ్ కమిటీ సమావేశాల బిజీ కారణంగా తుమ్మలకు ఎక్కువగా టైమ్ ​ఇవ్వలేకపోవడంతో ఆయనను మళ్లీ ఢిల్లీ పిలిపించుకున్నట్లు తెలు స్తోంది. అరగంట పాటు రాహుల్ గాంధీతో తుమ్మల రాష్ట్రంలో పార్టీకి సంబంధించి వివిధ అంశా లపై చర్చించారు. 

ఉమ్మడి జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలని తుమ్మలకు పార్టీ హైకమాండ్​ సూచించింది. పాలేరు నుంచి మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్​ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి బరిలోకి దిగనున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ను తుమ్మల మర్యాద పూర్వకంగా కలిశారు. కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ..‘‘మీలాంటి రాజకీయ విలువలు గల నేత కాంగ్రెస్ లో చేరడం సంతోషకరం. 

ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీరు చేసిన పనులతో చెరగని ముద్ర వేశారు. మీకు పాలేరుతో అనుబంధం ఉన్నా, పార్టీ బలోపేతం కోసం మిమ్మల్ని ఖమ్మం బరిలో ఉంచాలని నిర్ణయం తీసుకున్నాం”అని చెప్పారు.