బజార్ హత్నూర్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పూర్తిగా కుంటుబడిన అభివృద్ధిని గాడిలో పెడుతూ ప్రభుత్వం సంక్షేమ అమలు చేస్తోందని, అభివృద్ధికే మొదటి ప్రాధాన్యమని మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. శనివారం బజార్ హత్నూర్ మండల కేంద్రంతో పాటు దేగామ, పిప్పిరి గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి జె.భారతి–పాండురంగ్- తరఫున కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు.
మారుమూల పల్లెలు అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదని, కానీ రెండేండ్లలో ప్రజాప్రభుత్వం నిరుద్యోగులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు నరేశ్ జాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
