
నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో నారాయణపురం, గంగమూల తండా, వాచ్చ తండా, కడపగండి తండాల్లో హరితహార కార్యక్రమాన్నినిర్వహించారు. మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆస్ట్రేలియాకు చెందిన మాజీ మిస్ వరల్డ్ ఎస్మా వెల్డర్ హాజరయ్యారు. ఎంపిపి గుత్తా ఉమాదేవి, జెడ్‌పిటిసి వీరమల్ల భాను, సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరితో కలిసి మొక్కలు నాటారు. అంతకు ముందు మండల కేంద్రంలో ప్రాచీన శివాలయంలో ఎస్మా వెల్డర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.