న్యూఢిల్లీ: దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ భర్త, మిజోరం మాజీ గవర్నర్ కౌశల్ స్వరాజ్(73) కన్నుమూశారు. అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న కౌశల్.. గురువారం తుదిశ్వాస విడిచారని ఆయన కూతురు బన్సూరి స్వరాజ్ ప్రకటించారు.
‘‘నువ్వూఅమ్మ దగ్గరికి వెళ్లిపోయావా నాన్నా!” అని ఆమె ట్వీట్ చేశారు. కౌశల్ మృతి పట్ల ప్రధాని మోదీ సహా ప్రముఖ నేతలంతా సంతాపం తెలిపారు. కాగా, 1952 జులై 12న కౌశల్ జన్మించారు. ఆయన ప్రఖ్యాత క్రిమినల్ లాయర్. 1990 – 1993 మధ్య మిజోరం గవర్నరుగా పనిచేశారు. 1998 –2004 మధ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
