కరీంనగర్ బండి సంజయ్ జాగరణ దీక్షా శిబిరం వద్దకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శోభతో పాటు మరికొందరు మహిళా నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు శోభ. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, అదుపులోకి తీసుకున్నామన్నారు జగిత్యాల డిఎస్పి ప్రకాష్.పోలీసుల తీరును,ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు బొడిగె శోభ.
