ఫౌమ్ హౌస్ ఘటనపై 307 కేసు పెట్టాలి..స్టేషన్ బెయిల్ ఇచ్చిన వారిని అరెస్ట్ చేయాలి 

ఫౌమ్ హౌస్ ఘటనపై 307 కేసు పెట్టాలి..స్టేషన్ బెయిల్ ఇచ్చిన వారిని అరెస్ట్ చేయాలి 
  • మెదక్​ ఎంపీ రఘునందన్​ రావు​ డిమాండ్ 

పాపన్నపేట, వెలుగు: మాజీ ఎమ్మెల్యే పైలెట్​ రోహిత్​ రెడ్డి ఫామ్​హౌజ్​ ఘటనపై 307 కేసు నమోదు చేయాలని, స్టేషన్​ బెయిల్​ ఇచ్చిన వారందరనీ అరెస్ట్​ చేయాలని మెదక్​ ఎంపీ రఘునందన్​రావు డిమాండ్​ చేశారు. శనివారం మెదక్  జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్​లో జరిగిన దీన్​ దయాళ్​ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్​లో పాల్గొని మాట్లాడారు.

ఫామ్​హౌజ్​లో డ్రగ్స్​ దొరికడం, ఫైరింగ్​ జరిగిన ఘటనపై తాను స్పందించానని గుర్తు చేశారు. ‘మీ ప్రభుత్వం, మీ పోలీసులు 307 కేసు పెట్టకుండా స్టేషన్​ బెయిల్  ఇచ్చి వదిలేశారు.’ అని పీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​గౌడ్​ను ఉద్దేశించి అన్నారు.

బీజేపీ ఎక్కడ, ఏ పార్టీ వారు తప్పు చేసినా వారికి వ్యతిరేకంగా గళం విప్పుతుందని తెలిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన కాంగ్రెస్​ పెద్దలకు ఉంటే, స్టేషన్​ బెయిల్​ ఇచ్చిన వారందరినీ రిమాండ్  చేయాలన్నారు.

రివాల్వర్​ వాడిన వారిపై కేసు పెట్టాలని, తప్పించిన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని, ఫామ్​హౌజ్​లోని సీసీ పుటేజీని బయట పెట్టాలని డిమాండ్​ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్​ గౌడ్, శ్రీనివాస్, రంజిత్​ రెడ్డి, సత్యనారాయణ, నందారెడ్డి, సుభాష్​ చంద్రగౌడ్  పాల్గొన్నారు.