జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు పక్కా : మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్.

జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు పక్కా : మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్.
  • మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్..

ముషీరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలుస్తుందని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ముషీరాబాద్ అడిగ్మెట్​లో కాంగ్రెస్ నేత కరణం సురేశ్ నేతృత్వంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్​లో ఇతర పార్టీలకు ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్ (టిల్లు), నాయకులు సందీప్, కవిత, విజయ్ యాదవ్, నరేందర్, సోహెల్, కిరణ్, వల్లభ రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు.