
బెంగళూరు: రేప్ కేసులో జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు బెంగళూరులోని ఎంపీ, ఎమ్మెల్యేల స్పెషల్ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. శనివారం శిక్ష ఖరారు చేయనుంది. స్పెషల్ కోర్టు జడ్జి జస్టిస్ సంతోష్ గజానన్ భట్ తీర్పు వెలువరించగానే.. ప్రజ్వల్ రేవణ్ణ కంటతడి పెట్టుకున్నారు. పోయినేడాది హాసన్ సెక్స్ కుంభకోణం బయటకు రాగా.. ప్రజ్వల్‌పై నాలుగు రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను దర్యాప్తు చేసేందుకు కర్నాటక సర్కార్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది.
హాసన్ జిల్లాలో ప్రజ్వల్ కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఓ మహిళ (48) పని మనిషిగా వర్క్ చేయగా.. ఆమెపై ప్రజ్వల్ రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని వీడియో తీసి, ఎవరికైనా చెబితే ఆ వీడియోలను బయటపెడతానని బెదిరించాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయగా, సిట్ దర్యాప్తు చేపట్టి.. పోయినేడాది మే 31న ప్రజ్వల్‌ను అరెస్టు చేసింది. 113 మంది సాక్షుల వాంగ్మూలాలతో 1,632 పేజీల చార్జ్‌షీట్‌ను సెప్టెంబర్‌లో కోర్టులో దాఖలు చేసింది.
ఈ ఏడాది జులై 18న విచారణ ముగించిన కోర్టు.. తీర్పును 30కి వాయిదా వేసింది. అయితే టెక్నికల్ ఎవిడెన్స్‌పై మరింత క్లారిఫికేషన్ కోరిన కోర్టు.. తీర్పును ఒకరోజు వాయిదా వేసి, శుక్రవారం వెలువరించింది. ‘‘ఇది బాధితురాలు సాధించిన విజయం. ఈ కేసులో ఆమెనే బలమైన ఆధారం. సిట్ టీమ్ చాలా బాగా పని చేసింది. ఓరల్, డిజిటల్, టెక్నికల్ ఎవిడెన్స్‌లతో పాటు డీఎన్ఏ, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులను సమర్పించింది. 2021లో బాధితురాలిపై రేప్ జరగ్గా, ఆ రోజు ఆమె వేసుకున్న బట్టలనూ సిట్ సేకరించింది” అని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్ తెలిపారు.
మరో మూడు కేసులు..
ప్రజ్వల్‌పై మరో మూడు రేప్ కేసులు ఉన్నాయి. వాటినీ సిట్ దర్యాప్తు చేస్తున్నది. పోయినేడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు హాసన్ సెక్స్ కుంభకోణం బయటకు వచ్చింది. మహిళలను ప్రజ్వల్ లైంగికంగా వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధిత మహిళలు బయటకువచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో హాసన్ నుంచి పోటీ చేసిన ప్రజ్వల్ ఓడిపోయారు. సెక్స్ కుంభకోణం బయటకు రావడంతో
ఆయనను జేడీఎస్ నుంచి సస్పెండ్ చేశారు.