2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: మాజీ ఎంపీ వినోద్​కుమార్​

2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: మాజీ ఎంపీ వినోద్​కుమార్​

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది చివరి నాటికి కాంగ్రెస్​పార్టీ హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని మాజీ ఎంపీ వినోద్​కుమార్​డిమాండ్​చేశారు. బుధవారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ప్రభుత్వం జిల్లాలను మళ్లీ పునర్విభజన చేస్తామని అంటోందని, అదే జరిగితే ఉద్యోగ నియామకాల్లో మళ్లీ ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. జిల్లాలు మార్చితే వాటికి రాష్ట్రపతి ఆమోదం కావాల్సి ఉంటుందని, తద్వారా ఉద్యోగ నియమాకాలు ఆలస్యమవుతాని చెప్పారు.

బీఆర్ఎస్​ప్రభుత్వం పదేళ్లలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని పేర్కొన్నారు.  ప్రభుత్వం వెంటనే 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు గుర్తించి వాటి భర్తీ ప్రక్రియ చేపట్టాలన్నారు. ప్రొఫెసర్​కోదండరామ్​కు బాధ్యతలు పెరిగాయని ఆయనే నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.