టీ20 కెప్టెన్సీపై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు

టీ20 కెప్టెన్సీపై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా టీ20 కెప్టెన్సీపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ను విజేతగా నిలిపిన హార్దిక్ పాండ్యాను గంభీర్ మెచ్చుకున్నాడు. పాండ్యా సారథి రేసులో  కచ్చితంగా  ఉంటాడని చెప్పాడు. అయితే ఎగ్రెసివ్ కెప్టెన్ కావాలంటే పృథ్వీ షానే బెటర్ తెలిపాడు. ప్లేయర్ ఆటను బట్టి ఎగ్రెసివ్ను అంచనా వేయొచ్చన్నాడు. దీని ప్రకారం... షా చాలా ఎగ్రెసివ్ కెప్టెన్ అని చెప్పుకొచ్చాడు. అతను టీమ్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాడన్న నమ్మకాన్ని వెలిబుచ్చాడు. 

అతనికి ఆ సత్తా ఉంది..

టీమిండియాకు నాయకత్వం వహించే సత్తా పృథ్వీషాకు ఉందని గంభీర్‌ అన్నాడు. డోపింగ్‌ పరీక్షల తర్వాత  ఫిట్‌నెస్‌ కారణాలతో టీమ్లో  స్థానం నిలుపుకోలేకపోయాడన్నాడు. అయితే 15 మంది ఆటగాళ్లను సెలక్ట్ చేసే పని సెలక్టర్లదని చెప్పాడు. పృథ్వీషా దూకుడుగా ఆడుతాడని..అతను బెస్ట్ కెప్టెన్‌గా అవగలడని అభిప్రాయపడ్డాడు. 

కెప్టెన్సీలో మార్పులు..

టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు ప్రదర్శన తర్వాత కెప్టెన్సీలో మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీ20 పగ్గాలు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి.  అటు రోహిత్ శర్మ కూడా కెరీర్ చివరి దశలో ఉన్నాడు. అతను వచ్చే టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశాలు తక్కువే. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ పాండ్యాకు అప్పగించాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో గంభీర్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

పృథ్వీ షా కెప్టెన్సీలో వరల్డ్ కప్..

2018లో జరిగిన అండర్-19 ప్రపంచకప్లో టీమిండియా గెలిచింది. ఈ జట్టుకు పృథ్వీ షా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అటు రంజీలో ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం పృథ్వీ షా సొంతం. అటు హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాదు..తొలి సీజన్లో నే జట్టును విజేతగా నిలిపాడు. ఐర్లాండ్ పర్యటనలో  తొలిసారిగా కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్‌..సిరీస్‌ను 2-0తో ఆ సిరీస్ కైవసం చేసుకున్నాడు. రీసెంట్గా న్యూజిలాండ్‌పై కూడా హార్దిక్ కెప్టెన్సీలో  టీ20 సిరిస్‌ను 1-0 భారత్‌ కైవసం చేసుకుంది.