కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ .. మాజీ ప్రధాని మ‌న‌వ‌డు రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి  బిగ్ షాక్ ..   మాజీ ప్రధాని మ‌న‌వ‌డు రాజీనామా

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.   ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు.  తాజాగా కాంగ్రెస్ పార్టీకి మ‌రో బిగ్ షాక్ తగిలింది.  మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు, కాంగ్రెస్ నేత విభాకర్ శాస్త్రి  ఫిబ్రవరి 14న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  ఈ మేరకు ట్విట్టర్ లో ప్రకటించారు.  తన రాజీనామా లేఖను  కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు పంపించారు.  కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీలో చోటు ద‌క్కక‌పోవ‌డంతో విభాక‌ర్ శాస్త్రి మ‌న‌స్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విభాకర్ శాస్త్రి ఈరోజు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.  కాగా  ఇటీవలే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి  బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.  అశోక్‌ చవాన్‌కు రాజ్యసభ సీటు ఇస్తారనే ఊహాగానాల మధ్య ఆయన బీజేపీ గూటికి చేరుకోవటం గమనార్హం.

Also Read: రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ ధాఖలు చేసిన సోనియా గాంధీ