అస్వస్థతతో AIIMSలో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

V6 Velugu Posted on May 11, 2020

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అస్వస్థతతో నిన్న(ఆదివారం,మే-10) సాయంత్రం ఢిల్లీలోని AIIMS లో చేరారు. 87 ఏళ్ల మన్మోహన్‌ ప్రస్తుతం కార్డియో థొరాసిక్ వార్డులో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని…  ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నారని మన్మోహన్ సన్నిహితులు తెలిపారు. జ్వరం, చాతీలో నొప్పితో బాధపడుతుండడంతో మన్మోహన్ సింగ్ ను  ఆస్పత్రిలో చేర్చినట్టు చెప్పారు. రాత్రి 8:45 గంటల సమయంలో కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీశ్ నాయక్ ఆధ్వర్యంలో ఆయనను ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్టు చెప్పారు.

మన్మోహన్‌సింగ్ త్వరగా కోలుకోవాలని పలువురు నేతలు ఆకాంక్షించారు.

Tagged admitted, AIIMS, manmohan singh, Former PM, chest pain

Latest Videos

Subscribe Now

More News