
- ‘పీవీ మెమోరియల్ ఫౌండేషన్’కు సోనియా అభినందనలు
న్యూఢిల్లీ, వెలుగు: అర్థశాస్తంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా దివంగత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు 2025 ఏడాదికి గాను పీవీ మెమోరియల్ అవార్డు దక్కింది. శనివారం ఢిల్లీలో మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్ “పీవీ మెమోరియల్ ఫౌండేషన్” అవార్డును అందుకున్నారు. ప్రతియేటా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ పురస్కారాలను అందిస్తున్నది.
పీవీ ఫౌండేషన్ చేస్తున్న సేవలకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ అభినందనలు తెలిపారు. ప్రముఖులకు ఏటా పీవీ మోమోరియల్ ఫౌండేషన్ పురస్కారాలను అందించడాన్ని అభినందిస్తూ ఒక లేఖ రాశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు రామచంద్రమూర్తి, గౌరవ సలహాదారులు జయప్రకాష్ నారాయణ, పోలా విజయబాబు, జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్ ఉన్నారు.