- అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
హైదరాబాద్, వెలుగు: గతంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించాలని కోరుతూ మాజీ సర్పంచులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అఫ్జల్ గంజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం కనీసం పెండింగ్ బిల్లులపై స్పష్టత ఇవ్వకవడం దురదుష్టకరమన్నారు. కాగా.. మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినరసింహారెడ్డిని హైదరాబాద్‌లో ముందస్తు అరెస్టు చేశారు.
