- సింగరేణి సేవా అధ్యక్షురాలు ఎన్.శ్రీవాణి
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి యాజమాన్యం నిరుద్యోగ యువతకు వివిధ వృత్తి కోర్సులపై శిక్షణ ఇస్తూ ఉపాధి మార్గాలు చూపుతోందని మందమర్రి ఏరియా సింగరేణి సేవా అధ్యక్షురాలు, జీఎం సతీమణి ఎన్.శ్రీవాణి రాధాకృష్ణ అన్నారు. మందమర్రిలోని సీఈఆర్ క్లబ్లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషీయన్ కోర్సుల ట్రైయినింగ్ క్లాసెస్‌లను సోమవారం ఆమె ప్రారంభించారు.
2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరంలో వృత్తి శిక్షణ కోర్సుల్లో శిక్షణ పొందిన 607 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం కార్మికుల నిరుద్యోగ యువతీయువకులకు, పరిసర ప్రాంతాలు, ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల్లోని యువతకు ఫ్రీగా ఒకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తోందన్నారు. ట్రైనింగ్‌ను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీజీఎం(పర్సనల్) సీహెచ్.అశోక్, సీనియర్ ఆఫీసర్ బొంగోని శంకర్ గౌడ్, ఏఐటీయూసీ లీడర్ సత్యనారాయణ, సింగరేణి సేవా సమితి కో ఆర్డినేటర్ నెల్సన్ తదితరులు పాల్గొన్నారు.
