కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై సీఈసీ వేటు

V6 Velugu Posted on Jun 23, 2021

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. మూడేళ్లపాటు చట్ట సభల్లో పోటీ చేయకుండా సీఈసీ నిషేధం విదించింది. 2019 నుంచి మహబూబాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన బలరాం నాయక్.. నిర్ణీత గడువులోగా ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించలేదు. దీంతో ఆయనపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. బలరాం నాయక్‌పై వేటు వేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. 

గతంలో కాంగ్రెస్ తరపున 2009లో ఎంపీగా బలరాం నాయక్‌ ఎన్నికయ్యారు. ఆ తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు.

Tagged Former Union Minister, Balaram Nayak, CEC , banned contesting, three years

Latest Videos

Subscribe Now

More News