లిక్కర్‌‌‌‌ షాపుపైకి రాళ్లు విసిరిన ఉమాభారతి

లిక్కర్‌‌‌‌ షాపుపైకి రాళ్లు విసిరిన ఉమాభారతి

భోపాల్: మధ్యప్రదేశ్‌‌ రాజధాని భోపాల్‌‌లో ఒక వైన్‌‌ షాప్‌‌పైకి కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి రాళ్లు విసిరారు. రాష్ట్రంలో లిక్కర్ బ్యాన్‌‌ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే లిక్కర్‌‌‌‌ షాపుల వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ ఏడాది జనవరి 15 లోగా రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించాలని అంతకుముందే ఆమె డెడ్‌‌లైన్ పెట్టారు. అయితే లిక్కర్‌‌‌‌ బ్యాన్‌‌పై నిర్ణయం తీసుకోని సీఎం శివరాజ్‌‌ సింగ్‌‌ చౌహాన్ సర్కారు.. మద్యం చీప్‌‌గా లభించేలా కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది. ఫారిన్ లిక్కర్‌‌‌‌పై ఎక్సైజ్‌‌ డ్యూటీని 10 నుంచి 13% వరకు తగ్గించింది. వైన్‌‌ షాపుల్లో ఫారిన్‌‌ లిక్కర్‌‌‌‌తోపాటు దేశీయ మద్యాన్ని కూడా అమ్ముకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఏడాదికి రూ.కోటి అంతకంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులు ఇంట్లోనే బార్‌‌‌‌ ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పింది. ద్రాక్షతోపాటు బ్లాక్‌‌ ప్లమ్స్‌‌ నుంచి కూడా వైన్‌‌ తయారు చేయవచ్చని లిక్కర్‌‌‌‌ కంపెనీలకు అనుమతి ఇచ్చింది. గతంలో కంటే నాలుగు రెట్లు ఎక్కువగా మద్యాన్ని నిల్వ చేసుకోవడానికి పాలసీలో వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపై జనవరిలోనే మండిపడిన ఉమాభారతి.. ఆదివారం కొంతమంది మద్దతుదారులతో భోపాల్‌‌లోని ఒక లిక్కర్‌‌‌‌ షాపుకు చేరుకుని, అందులోని మద్యం బాటిళ్లపైకి రాళ్లు విసిరారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌‌లో 2,544 దేశీయ లిక్కర్‌‌‌‌, 1,061 ఫారిన్ లిక్కర్‌‌‌‌ షాపులు ఉన్నాయి.