విలాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపణలు నిరాధారం : మాజీ చైర్మన్ రాజశేఖర్

 విలాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపణలు నిరాధారం :  మాజీ చైర్మన్ రాజశేఖర్
  • బ్యాంకు మాజీ చైర్మన్ రాజశేఖర

కరీంనగర్ సిటీ, వెలుగు: అర్బన్ బ్యాంక్ పీఏసీ కమిటీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి వ్యాఖ్యలు బ్యాంక్ పరువును తీసేలా ఉన్నాయని, అవన్నీ పూర్తిగా నిరాధారమైనవని అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గత నెల 27న జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు  కోరం లేక వాయిదా పడిందని, ఈ నెల 3న మరోసారి 208 మంది సభ్యులతో సమావేశం పెట్టినా అదే పరిస్థితి ఎదురైందని తెలిపారు. బ్యాంకులో ఓవర్‌‌‌‌‌‌‌‌ రైటింగ్ జరిగిందన్న ఆరోపణలకు తాము బాధ్యులు కాదని, మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ బుక్స్ సీఈవో వద్ద ఉంటాయన్నారు. 

నోటీసు ఇవ్వకుండా తమ సభ్యత్వాలు రద్దు చేయడాన్ని ఖండించారు. విలాస్ రెడ్డికి తమ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ రద్దు చేసే హక్కులేదని కోర్టు ఆర్డర్ వస్తే అక్కడే తేల్చుకుంటామని చెప్పారు. సమావేశంలో మాజీ పాలకవర్గ సభ్యులు బాశెట్టి కిషన్, వరాల జ్యోతి, లక్ష్మణ్ రాజు, అన్నరాసుకుమార్ ,సాయికృష్ణ, వీరారెడ్డి, శమీయోద్దీన్, వజీర్, అహ్మద్ పాల్గొన్నారు.