జడ్చర్ల టౌన్, వెలుగు: జడ్చర్ల మండల పరిధిలోని బాదేపల్లి పాతబజార్ హరిజనవాడలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో, రూ.80 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న నూతన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనానికి కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే లక్ష్యమని, అరబిందో ఫార్మా సంస్థ మొత్తం రూ.4 కోట్లతో వివిధ పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తోందని వెల్లడించారు.
