15న సెక్రటేరియెట్లో సోలార్ పార్కింగ్కు శంకుస్థాపన

15న సెక్రటేరియెట్లో సోలార్ పార్కింగ్కు శంకుస్థాపన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సెక్రటేరియెట్​లో సోలార్ పార్కింగ్ నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 15వ తేదీన శంకుస్థాపన భూమిపూజ చేయనున్నారు. నిర్మాణానికి ప్రభుత్వం రూ.17 కోట్లు మంజూరు చేసింది. సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ విభాగాల్లో వాహనాల పార్కింగ్ ప్రాంతాన్ని కవర్ చేసే సోలార్ -ప్యానెల్ పైకప్పు నిర్మాణం చేపట్టనున్నారు. 

బహుళ-స్థాయి పార్కింగ్ (జీ+2) సౌకర్యంతో కానోపీలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రెడ్కో, రాష్ట్ర రోడ్లు, భవనాల సంస్థలు సంయుక్తంగా ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. సెక్రటేరియెట్ విద్యుత్ అవసరాలను సోలార్ ఎనర్జీతో తీర్చడం, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం.