నార్త్ vs సౌత్: అమ్మాయిల స్వేచ్ఛ విషయంలో ఎవరు బెటర్..?

నార్త్ vs సౌత్: అమ్మాయిల స్వేచ్ఛ విషయంలో ఎవరు బెటర్..?

భాష, సంస్కృతి, ఆచారాల్లో నార్త్ ఇండియా.. సౌత్ ఇండియాకి చాలా తేడా ఉంది. ఇందులో మహిళలకు చదువు, పెళ్లి, ఉద్యోగాల్లో ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుందన్నది చెప్పుకోవాల్సిన విషయం. గత ఇరవయ్యేళ్ల కాలంలో అన్నిరంగాల్లో మహిళలు ముందుకెళ్తున్నారు. కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయిలకు దక్షిణాది రాష్ట్రాల వాళ్లతో పోలిస్తే, కొంత స్వేచ్ఛ తక్కువగా ఉంటోందని తాజాగా ఒక సర్వేలో తేలింది. 

నార్త్ ఇండియన్ పేరెంట్స్ తమ ఆడపిల్లలను పెద్ద చదువులు చదివిస్తున్నా.. పెళ్లి విషయంలో పిల్లల అభి ప్రాయానికి విలువ ఇవ్వట్లేదని, బయటికెళ్లి ఉద్యోగాలు చేసేందుకు ఒప్పుకోవట్లేదని సర్వేలో పాల్గొన్నవాళ్లు చెప్పారు. చదువుకో ని మహిళలు వ్యవసాయం, కూలీ పనులు చేయడానికి ఒప్పుకుంటున్నా, చదువు కున్న అమ్మాయిలను మాత్రం ఉద్యోగం చేయనివ్వట్లేదు.

 అదే సౌత్ ఇండియాలో చదువుకున్న అమ్మాయిల్లో ఎనభై శాతం మంది ఉద్యోగం చేయడానికి పేరెంట్స్ ఒప్పుకుంటున్నారట! అలాగే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, కోరుకున్న అబ్బాయిలతో పెళ్లి, పెళ్లయ్యాక భర్తతో గొడవలు వస్తే విడాకులు తీసుకోవడం లాంటివాటిలో వీళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఈ సర్వేలో తేలింది.