
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో కొత్త హైకోర్టు బిల్డింగ్ నిర్మాణానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ బుధవారం భూమిపూజ చేశారు. కొత్త హైకోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరా ల భూమిని కేటాయించింది. 1,550 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ నున్న ఈ కాంప్లెక్స్‌లో 8 కోర్టు హాల్స్, 8 జడ్జిల చాంబర్లు నిర్మించనున్నారు.
భూమి పూజ కార్యక్రమంలో హైకోర్టు జడ్జిలు జస్టిస్ పి.శ్యాం కోశీ, జస్టిస్ కె.లక్ష్మణ్ రావు, జస్టిస్ బి. విజయ్ సేన్‌రెడ్డి, అటార్నీ జనరల్ సుదర్శన్ రెడ్డి, కాంట్రాక్టర్ కంపెనీ ఎండీ అనిరుధ్ గుప్త, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మొహన్ రావు తదితరులు పాల్గొన్నారు