మార్చి 8న పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన

మార్చి 8న పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 8వ తేదీన ఫలక్‌‌నుమాలో ఓల్డ్ సిటీ మెట్రో లైన్ నిర్మాణ పనులకు సీఎం రేవంత్‌‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌‌నుమా వరకు 4 స్టేషన్లు నిర్మించనున్నారు. 5.5 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ నిర్మాణానికి రూ. 2000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఎంజీబీఎస్​ నుంచి దారుల్ షిఫా జంక్షన్, పురానీహవేలీ, ఇత్తేబాద్ చౌక్, అలీజాకోట్ల, మీర్​మోమిన్​దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్​గంజ్, అలియాబాద్​ప్రాంతాల మీదుగా ఫలక్ నుమా వరకు అలైన్​మెంట్​ఉంటుంది. 

సాలర్​జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్​నుమా ఏరియాల్లో స్టేషన్లు నిర్మించనున్నారు. నిర్మాణంలో 1,100 ప్రాపర్టీలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మతపరమైన, చారిత్రక కట్టడాలు డ్యామేజ్​కాకుండా చూసేందుకు అధికారులు రోడ్డు విస్తరణను 100 ఫీట్లకే పరిమితం చేశారు. స్టేషన్ల వద్ద రోడ్డును 120 ఫీట్లకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ లైన్​అందుబాటులోకి వస్తే చార్మినార్, సాలర్ జంగ్​మ్యూజియం వంటి చారిత్రక కట్టడాలను మెట్రోలో వెళ్లి చూసి రావచ్చు.