పెద్దపులిపై విష ప్రయోగానికి యత్నించిన నలుగురు అరెస్ట్

పెద్దపులిపై విష ప్రయోగానికి యత్నించిన నలుగురు అరెస్ట్

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట సమీపంలోని ఫారెస్ట్ ఏరియాలో ఇటీవల ఆవుపై పులి దాడి చేసిన విషయం తెలిసిందే.  పులిని చంపేందుకు నలుగురు వ్యక్తులు చనిపోయిన ఆవుపై విష పదార్థాలు చల్లినట్లు ఫారెస్ట్​ అధికారులు గుర్తించారు.

స్కూల్ తండాకు చెందిన బిక్యా మహిపాల్, గంగావత్ కన్నీరాం,  సలావత్ సంజీవ్,  గోపాల్​లను అరెస్ట్​చేసి మంగళవారం రిమాండ్​కు తరలించినట్లు ఎఫ్​వో నిఖిత, మాచారెడ్డి ఎఫ్ఆర్వో దివ్య తెలిపారు.  పులి జాడ కోసం  రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లోని ఫారెస్ట్​ ఏరియాల్లో అధికారులు, సిబ్బంది విస్తృతంగా గాలించారు.   ట్రాక్​ కెమెరాలు,  డోన్​ కెమెరాలతో అన్వేషిస్తున్నారు.