హైదరాబాద్​లో 4 రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్​లో 4 రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షం కురిసింది. అత్యధికంగా టోలిచౌకీలో 2.10 సెంటిమీటర్లు, బంజారాహిల్స్  1.60, ఆసీఫ్ నగర్​లో 1.35 సెంటిమీటర్ల వర్షం పడింది. నగరంలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు నేడు,  సోమవారం, మంగళవారం, బుధవారం  ( జూన్​ 8 నుంచి 11 వరకు) ఎల్లో అలర్ట్ (6.45 సెంటిమీటర్ల నుంచి 11.55 సెంటిమీటర్ల వర్షం కురిసే చాన్స్) జారీ చేసింది.