‘గ్రేటర్’లో బీజేపీకి బిగ్ షాక్

‘గ్రేటర్’లో బీజేపీకి బిగ్ షాక్
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఒక రోజు ముందే షాక్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఒక రోజు ముందే బీజేపీకి తెలంగాణలో బిగ్ షాక్ తగిలింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో నలుగురు జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ అధికార పార్టీలో చేరారు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్(బీజేపీ), రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన ప్రకాష్ (బీజేపీ), జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్ (బీజేపీ), అడిక్ మెట్ కార్పొరేటర్ సునీతా ప్రకాష్ గౌడ్ (బీజేపీ), తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, పైలెట్ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.