Asia Cup 2025: ఆసియా కప్‌కు మిస్ అవుతున్న నలుగురు టీమిండియా స్టార్ ప్లేయర్లు వీరే!

Asia Cup 2025: ఆసియా కప్‌కు మిస్ అవుతున్న నలుగురు టీమిండియా స్టార్ ప్లేయర్లు వీరే!

ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ లో ఆడనుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగబోతుంది. ఈ కాంటినెంటల్ టోర్నీకి నెల రోజుల సమయం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా ఆడనున్న పెద్ద టోర్నీ ఇదే. ఈ సిరీస్ లో ఆడిన జట్టే దాదాపు 2026 లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కూడా ఆడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 8 జట్లు ఆడనున్న ఈ మెగా టోర్నీ వరల్డ్ కప్ సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఆసియా కప్ కు ముందు టీమిండియాకు కొన్ని షాకులు తప్పేలా లేవు. ఈ మెగా టోర్నీకి మిస్ అవుతున్న స్టార్ భారత ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

జస్ప్రీత్ బుమ్రా:

బుమ్రా విషయంలో బీసీసీఐ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అతనికి పని భారం కారణంగా అతనికి రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెల రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ లోపు బుమ్రాను హడావిడిగా ఆసియా కప్ ఆడించి రిస్క్ చేసే ఆలోచనలో బీసీసీఐ లేనట్టు తెలుస్తోంది. ఆసియా కప్ తర్వాత స్వదేశంలో టీమిండియా వెస్టిండీస్ తో రెండు టెస్ట్ ల మ్యాచ్ కు అందుబాటులో ఉండకపోవచ్చు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత బుమ్రా ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. 

కేఎల్ రాహుల్:

భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆసియా కప్ కు సెలట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కుర్రాళ్లతో పోటీ కారణంగా రాహుల్ కు జట్టులో అవకాశం దక్కడం కష్టం. ప్రస్తుతం యంగ్ టీమిండియా టీ20ల్లో అదరగొడుతుంది. అనుభవజ్ఞుడైన రాహుల్ లేకపోయినా ఆ ప్రభావం జట్టుపై పడే అవకాశం లేదు. వికెట్ కీపర్ గా సంజు శాంసన్ తొలి ఆప్షన్ కాగా.. జితేష్ శర్మ బ్యాకప్ కీపర్ గా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ లో రాహుల్ అద్భుతంగా రాణించినా అతనికి నిరాశ తప్పకపోవచ్చు. 

ALSO READ : Shubman Gill: శుభ్‌మాన్ గిల్ టెస్ట్ జెర్సీ వేలం..ఎంతకు అమ్ముడుపోయిందంటే..

శుభమాన్ గిల్:

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ టీ20 ఆసియా కప్ కు ఎంపికయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. భారత్ తరపున గిల్ టీ20 ఆడి చాలా కాలమైంది. వన్డే, టెస్ట్ క్రికెట్ తో బిజీగా కనిపిస్తున్న గిల్.. టీ20 ఫార్మాట్ కు దూరమవుతున్నాడు. ఓపెనర్ గా సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఎలాగో సూపర్ ఫామ్ లో ఉన్నారు. బ్యాకప్ ఓపెనర్ గా జైశ్వాల్ సెలక్ట్ కానున్నాడు. గిల్ ఐపీఎల్ 2025 సీజన్ లో అత్యుత్తమంగా రాణించినా ప్రస్తుతం ఉన్న టీ20 జట్టులో గిల్ ను కష్టంగా ఇరికించలేని పరిస్థితి. అంతేకాదు దులీప్ ట్రోఫీలో గిల్ నార్త్ జోన్ కు కెప్టెన్ గా వ్యవహరించడంతో ఆసియా కప్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రిషబ్ పంత్:
 
ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో గాయపడిన పంత్ సర్జరీ నుంచి తప్పించుకున్నాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో గాయపడిన రిషబ్.. ఓవల్ లో జరిగిన ఐదో టెస్టుకు దూరమయ్యాడు. కాలికి తీవ్ర గాయం కావడంతో మొదట సర్జరీ అవసరమని భావించినా.. ఆ తర్వాత ఆ అవసరం లేదని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. అయితే గాయపడిన పంత్ కు 6 వారాల రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో పంత్ సెప్టెంబర్ లో జరగబోయే ఆసియా కప్ కు దూరమయ్యాడు. 


2025 ఆసియా కప్ కు భారత జట్టు (అంచనా)

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, రియాన్ పరాగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్‌దీప్‌ పటేల్, వరుణ్‌దీప్ చక్రవర్తి, కె. రానా, ప్రసిద్ధ్ కృష్ణ.