మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణను కలిసిన  మరో నలుగురు మంచిర్యాల కార్పొరేటర్లు

మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణను కలిసిన   మరో నలుగురు మంచిర్యాల కార్పొరేటర్లు

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను మంచిర్యాల కార్పొరేషన్​కు చెందిన మరో నలుగురు కార్పొరేటర్లు, పలువురు లీడర్లు కాంగ్రెస్​ లీడర్ మంతెన జగన్​మోహన్​ రావు ఆధ్వర్యంలో కలిశారు. మంచిర్యాల కార్పొరేషన్​ పరిధిలోని 5, 6, 8వ వార్డుల కార్పొరేటర్లు​తోటపల్లి రాజేశ్వరి, వనపర్తి కేతా రాజేశ్, మేకల రమేశ్, 48వ వార్డు కార్పొరేటర్​వేములపల్లి లక్ష్మీదుర్గ కొడుకు మాజీ కౌన్సిలర్​సంజీవ్, మార్కెటింగ్​కమిటీ డైరెక్టర్ ​ఇర్ఫాన్​తో పాటు వివిధ డివిజన్లకు చెందిన లీడర్లు పెద్ద సంఖ్యలో హైదరాబాద్​లోని మినిస్టర్స్​ క్వార్టర్​లో శుక్రవారం మంత్రి, ఎంపీని మర్యాపూర్వకంగా కలిశారు. గురువారం సైతం ముగ్గురు మంచిర్యాల కార్పొరేటర్లు, లక్షేట్టిపేట మున్సిపల్ ​కౌన్సిలర్లు, దండేపల్లి సర్పంచి, ఉప సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, లీడర్లు కలిసిన మంత్రి వివేక్, ఎంపీ వంశీని కలిసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్​ మాజీ చైర్​పర్సన్ ​రావుల ఉప్పలయ్య, మాజీ కౌన్సిలర్​అగల్​డ్యూటీ రాజు తదితరులు పాల్గొన్నారు.