
గొర్రెల స్కాం కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిధులు పక్కదారి మళ్లించిన అధికారులను, కాంట్రాక్టర్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఈ క్రమంలో నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఈరోజు (ఫిబ్రవరి 22) అరెస్టు చేశారు. ఇందులో భాగంగా ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రైవేట్ వ్యక్తులతో కలిసి పశుసంవర్ధన శాఖ అధికారులు బినామీ ఖాతాలు తెరిచినట్టు సమాచారం అందిందని ఏసీబీ అధికారులు తెలిపారు. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను నిందితులు మళ్లించారని పేర్కొన్నారు.