ఈతకు వెళ్లి నలుగురు మృతి

ఈతకు వెళ్లి నలుగురు మృతి
  • నలుగురిని మింగిన ఊరి చెరువు
  • తాత, ఇద్దరు మనుమలతో పాటు మరో బాలుడు
  • కొలనూరులో విషాదం
  •  రాత్రి వరకు ఇద్దరి శవాలు బయటకు

పెద్దపల్లి టౌన్ , వెలుగు; ఈత సరదా నలుగురి ప్రాణంతీసింది . ఎండకాలం సెలవుల్లో తాతగారింటికి వచ్చిన వారికి అవే చివరి రోజలయ్యాయి. అందరితో సందడిగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా విషాదం నిండింది . పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరుకు చెంది న కస్తూరి రాజయ్య (70) కొడుకు మల్లేష్‍గోదావరిఖనిలో కూలీ పనులు చేసుకుంటున్నాడు. అతని ఇద్దరు కొడుకులు ఆదర్శ్​ (17), సిద్దార్థ (14).వారిద్దరు వేసవి సెలవుల్లో గడిపేందుకు తాతయ్య ఇంటికి వచ్చారు. వీరి ఇంటి దగ్గరే ఉండే ఆరెపల్లి పోచయ్య కూతురు శైలజ కొడుకు జిత్తు (10) కూడా గౌరెడ్డిపేట నుంచి అమ్మమ్మ ఇంటికి వచ్చాడు.శనివారం తన మనుమలు ఈత నేర్పించమనడంతో రాజయ్య వారిని ఊర చెరువులోకి తీసుకెళ్లాడు. జిత్తును కూడా వారితో తీసుకెళ్లారు.

ఈత నేర్పుతుండగా ఏం జరిగిందో గాని నలుగురు నీళ్లల్లో మునిగి-పోయారు. సాయంత్రం ఆరైనా వారు తిరిగిరాకపోవ-డంతో అనుమానం వచ్చిన రాజయ్య రెం డో కొడుకురాజేశం చెరువు వద్దకు వచ్చాడు. వాళ్ల బట్టలు,చెప్పులు, బైక్‌ అక్కడే ఉండడంతో చెరువులో మునిగిఉంటా రని భావించి గ్రామస్థులకు, పోలీసులకుసమాచారం అందిం చారు. చెరువు వద్దకు చేరుకున్నగ్రామస్తులు, పోలీసులు దాదాపు 4గంటలు శ్రమించికస్తూరి రాజయ్య, మనుమడు సిద్దార్థ మృతదేహాల-ను బయటకు తీశారు. రాత్రి 8గంటల వరకు చెరువుఅంతా వెతికినా మిగతా రెం డు మృతదేహాల జాడతెలియరాలే దు. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి ఏసీపీవెంకట రమణరెడ్డి, ఎస్సై చంద్ర కుమార్‍ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమ మట్టి తవ్వకాలే కారణం..

చెరువులో అక్రమ మట్టి తవ్వకాలే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్​ కట్టకు చెరువు మట్టినే తరలించినట్లు చెప్తున్నారు. చెరువులో ఒకే చోట ఎక్కువగా లోతు తవ్వి మట్టిని తరలించినట్లు చెప్తున్నారు. ప్రణాళిక లేకుండా చెరువు పూడికలు తీయడం, ఇటుక బట్టిలకు మట్టిని తరలించడం వల్ల ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.