రైలు కిందపడి నలుగురు ఆత్మహత్య

రైలు కిందపడి నలుగురు ఆత్మహత్య

తమిళనాడు: రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం పొద్దున తమిళనాడులోని కొడై రైల్వే స్టేషన్ పరిదిలో జరిగింది. స్టేషన్ కు 200మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడినట్లు వారు చెప్పారు. గుర్తింపు కార్డుల ఆదారంగా.. మృతి చెందిన వారు… ఉత్తిర భారతి(49), సంగీత(40), అభినయ శ్రీ(15), ఆకాష్(12) లు గా గుర్తించారు. వీరు ఉరయూర్ తిరుచికి చెందినవారుగా చెప్పారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని.. ఆత్మహత్యకుగల కారణాలను తెలుసుకుంటున్నామని చెప్పారు పోలీసులు.