నిమ్స్ లో కలకలం: నలుగురు డాక్టర్లు, ముగ్గురు సిబ్బందికి కరోనా

నిమ్స్ లో కలకలం: నలుగురు డాక్టర్లు, ముగ్గురు సిబ్బందికి కరోనా

హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే తాజాగా నిమ్స్ కు చెందిన నలుగురు డాక్టర్లు ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్లు ది హిందూ కథనాన్ని ప్రచురించింది

కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న నలుగురు డాక్టర్లు, ముగ్గురు సిబ్బంది లక్షణాలు ఉండడం తో వైద్య పరీక్షలు చేసినట్లు నిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ తెలిపారు. ఈ పరీక్షల్లో వారికి కరోనా సోకినట్లు నిర్ధారించామన్నారు.

నలుగురు డాక్టర్లు నిమ్స్ కార్డియాలజీలో సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేస్తున్నారని, ఇందులో భాగంగా పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేస్తారని అన్నారు. క్యాత్ ల్యాబ్ లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది కరోనా సోకినట్లు చెప్పారు.

మరో వైపు 151మంది ఉస్మానియా మెడికల్ పీజీ విద్యార్ధులకు కరోనా  టెస్ట్ లు చేయగా అందులో 12మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 129మంది టెస్ట్ ల రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. కరోనా సోకిన 12మంది పీజీ విద్యార్ధుల్లో పేట్ల బురుజు మోడరన్ గవర్నమెంట్ మెటర్నిటీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురికి కరోనా సోకింది.