
శ్రీనగర్: నార్త్ కాశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద గస్తీ కాస్తున్న నలుగురు సైనికులను కొండచరియలు బలితీసుకున్నాయి. కుప్వారా జిల్లాలోని టాంగ్‌ధర్ ఏరియా ఆర్మీ పోస్ట్‌లో గస్తీ కాస్తున్న నలుగురు సైనికులపై ఒక్కసారిగా మంచు పడటంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. ఇంకొకరిని కాపాడిన సైనికులు హాస్పిటల్‌కు తరలించారు. బందిపోరా జిల్లాలోని గుర్జ్ సెక్టార్‌లో డ్యూటీ చేస్తున్న ఇద్దరు సైనికులపై కొండచరియలు విరిగిపడటంతో ఒకరు మంచులో ఇరుక్కుని చనిపోగా.. మరొకరిని ప్రాణాలతో కాపాడామని అధికారులు చెప్పారు. రెండు వారాల వ్యవధిలో కొండచరియలు విరిగిపడటం ఇది మూడోసారి. ఈ మధ్య సియాచిన్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు సైనికులు చనిపోయారు.