
- ఎన్ కౌంటర్లలో ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లు జరిగాయి. శనివారం కూల్గాం జిల్లాలో సైన్యం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లు నిర్వహించింది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు, నలుగురు టెర్రరిస్టులు మరణించారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో టెర్రరిస్టులు ఉన్నారని ఆర్మీకి సమాచారం అందింది.
దీంతో మోడెర్గామ్ గ్రామంలో సీఆర్ పీఎఫ్, ఆర్మీ, స్థానిక పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. టెర్రరిస్టులు ఎదురుకాల్పులు జరపడంతో ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యి మృతి చెందారు. జిల్లాలోని ఫ్రీసల్ ప్రాంతంలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ఒక సైనికుడు, నలుగురు టెర్రరిస్టులు మరణించారు.