
న్యూఢిల్లీ: యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఇండియాలో ఐఫోన్ 17 ను తయారు చేసేందుకు చైనా నుంచి కొన్ని ముఖ్యమైన విడిభాగాలను దిగుమతి చేయడం ప్రారంభించింది. ఈ నెలలోనే ట్రయల్ ప్రొడక్షన్ ఉంటుందని అంచనా. ఆగస్టులో పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ మొదలవుతుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఐఫోన్ 17 ఫోన్లను ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్లోబల్‌గాబబ లాంచ్ చేస్తారని తెలిపారు. ఇండియా, చైనాలో ఏకకాలంలో ఈ మోడల్‌ను ఉత్పత్తి చేయాలని , చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది.
2026 నాటికి భారత్‌ను అమెరికాకు ఐఫోన్ ఎగుమతి కేంద్రంగా మార్చాలని భావిస్తోంది. జూన్‌లో ఫాక్స్‌కాన్ దిగుమతుల్లో 10శాతం ఐఫోన్ 17 భాగాలు ఉన్నాయి. డిస్‌ప్లే అసెంబ్లీలు, కవర్ గ్లాస్, కెమెరా మాడ్యూల్స్ వంటివి దిగుమతి చేసుకుంది.