ప్రపంచంలో అతిపెద్ద ఐఫోన్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూప్ చైనాలో ఉంది. దీన్నే ఐఫోన్ సిటీగా పిలుస్తారు. దాదాపు 70 శాతం ఐఫోన్లు ఈ ప్లాంట్ నుంచే ఎగుమతి అవుతాయి. అయితే, గత కొంతకాలంగా కరోనా వల్ల ఈ ప్లాంట్ తాత్కాలికంగా మూతపడింది. దాన్ని ఇప్పుడు తెరిచి 90శాతం సామర్థ్యంతో పనిచేయనున్నట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. దాదాపు 2,00,000 మంది ఉద్యోగులతో ఈ ప్లాంట్ ని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. దీంతో యాపిల్ మార్కెట్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది.
చైనాలో కోవిడ్ విజృంబించడంతో లాక్ డౌన్ విధించి, జీరో కోవిడ్ ఆంక్షలు విధించారు. దాంతో చాలా టెక్ కంపెనీలకు ఉద్యోగులు వెళ్లడం మానేశారు. కొన్ని కంపెనీలు తాత్కాలికంగా మూసివేశాయి. అయితే, జీరో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయడంతో ఇప్పుడిప్పుడే కంపెనీల్ని మళ్లీ తెరుస్తున్నారు. ఫాక్స్ కాన్ కంపెనీని మూసేయడంవల్ల యాపిల్ కంపెనీకి లాస్ వచ్చింది. బ్లాక్ ఫ్రైడే, క్రిస్మస్ డీల్ లో డిమాండ్ తగ్గ ఫోన్లను సప్లై చేయలేకపోయింది.