నగల తయారీలో మోసం చేశారని స్వర్ణకారులపై దాడి

V6 Velugu Posted on Jul 26, 2021

హైదరాబాద్: చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బెంగాల్ కు చెందిన స్వర్ణకారులను ఓ గోల్డ్ వ్యాపారి చితకబాదాడు. నగల తయారీలో నిర్లక్ష్యంగా వహించారంటూ చిన్న సిలిండర్ కు చేతులు కట్టేసి  ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. సమాచారం అందుకున్న చార్మీనార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గోల్డ్ వ్యాపారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాతబస్తీ పరిధిలోని తపేళాగంజి ప్రాంతానికి పశ్చిమబెంగాల్ నుంచి కొంతమంది స్వర్ణకారులు  హైదరాబాద్ కి వచ్చి ఉపాధి పొందతున్నారు. గోల్డ్ వ్యాపారి నుంచి బంగారాన్ని తెచ్చుకుని నగలు చేయించి ఇస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది బెంగాల్ స్వర్ణకారులు ఓ గోల్డ్ వ్యాపారి నుంచి బంగారం తీసుకుని నగలు తయారు చేశారు. కానీ నగల తయారీ విషయంలో సదరు స్వర్ణకారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని సదరు గోల్డ్ వ్యాపారి స్వర్ణకారులను తీవ్రంగా చితకబాదినట్లు తెలిపాడు.

Tagged Hyderabad, attack, making, fraud, Jewelry, , jewelers

Latest Videos

Subscribe Now

More News