
కామారెడ్డి జిల్లా : పట్టా మార్పిడిలో మోసం చేసిన ఇద్దరు VRA లను సస్పెండ్ చేశారు తహసిల్దార్. ఈ సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగింది. మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామ VRA పుప్పల రవితో పాటు ..ఎల్లంపేట VRA కుమారి ఎం.రవళిని విధుల నుంచి సస్పెండ్ చేశారు మాచారెడ్డి తహసిల్దార్ వై. శ్రీనివాసరావు. గతంలో తహసీల్దార్ గా శ్యామల ఉన్న సమయంలో ఆమె పేరుమీద, తన బంధువుల పేరుమీద అక్రమంగా చేసుకున్నారని గుర్తించారు.
భూ రికార్డుల ప్రక్షాళనలో అవకతవకలకు పాల్పడటంతో పట్టాలు కోల్పోయిన బాధితులకు ఈ విషయం తెలిసింది. ఈ నెల 17వ తేదీన ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా బాధితులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం బయటపడిందన్నారు తహసీల్దార్ శ్రీనివాసరావు. ఈ క్రమంలోనే విలేజ్ సర్వెంట్ సర్వీసెస్ 42 రూల్ ప్రకారం ఇద్దరు VRAలను విధుల నుండి సస్పెండ్ చేసినట్లు తెలిపారు తహసీల్దార్.