గిఫ్టుల పేరుతో మోసం.. ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్

గిఫ్టుల పేరుతో మోసం.. ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్

హైదరాబాద్: గిఫ్టుల పేరుతో మోసం చేసిన ఇద్దరు నైజీరియన్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి కోసం ఉత్తర్ ప్రదేశ్ కు వెళ్లి అరెస్టు చేసి తీసుకొచ్చారు  హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు. బహుమతుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ల అరెస్ట్ వివరాలను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు, సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ మీడియాకు వెల్లడించారు. 
డాక్టర్ హ్యారీ రాబర్ట్ పేరుతో తాను అమెరికన్ సిటిజన్ అంటూ బేగంపేట్ కు చెందిన వ్యక్తికి పరిచయం చేసుకున్నాడు నైజీరియన్. సెలవుల్లో ఇండియాకు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నామని నమ్మిచారు. బాధితుడికి మొబైల్, ల్యాప్ టాప్, వాచ్ లను కొనుగోలు చేసినట్లు చెప్పాడు.  జులై 12న ఢిల్లీకి వస్తున్నట్లు చెప్పాడు. అతనికోసం ఎదురు చూస్తున్న బేగంపేట్ వ్యక్తికి ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌నంటూ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. హ్యారీ రాబర్ట్ ఎయిర్ పోర్టులో పట్టుకున్నామని, మనీ లాండరింగ్, ఇతర సర్టిఫికెట్లు కోసం డబ్బులు చెల్లించాలని చెప్పారు. దీంతో బాధితుడు 9లక్షల రూపాయలను వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు ఆన్ లైన్ ద్వారా పంపాడు. చివరకు మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. 

 

ఇవి కూడా చదవండి

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న కాల్ సెంటర్

కొంప ముంచిన పెంపుడు శునకం బర్త్ డే పార్టీ

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం