హైదరాబాద్: ఎల్బీనగర్లోని స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ప్లాట్లు ఇస్తామని చెప్పి డబ్బులు కట్టించుకొని తమను స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు కట్టించుకొని గత మూడేళ్ళుగా ప్లాట్లు ఇవ్వకుండా, ఇటు డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని.. పుస్తెల తాళ్లు కుదవ పెట్టుకొని పిల్లల భవిష్యత్ కోసం ప్లాట్లు కొనుగోలు చేస్తే.. ఇప్పుడు మోసం చేశారని గోడు వెల్లబుచ్చుకున్నారు.
ఎప్పుడు ఆఫీస్‌కు పోయి ప్లాట్ల గురించి అడిగిన డేట్లు మారుస్తూ వస్తున్నారని మండిపడ్డారు. బాధితుల్లో ఎక్కువగా పేదలు, మధ్యతరగతి వారే ఎక్కువ ఉన్నారు. కాగా, మొదట ప్లాట్లు ఎక్కువగా అమ్మిన ఏజెంట్లకు కాస్ట్లీ ఫార్చూనర్, ఆడీ, బీఎండ్ల్యూ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన యాజమాన్యం.. ఇప్పుడేమో తీరా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కుచ్చు టోపి పెట్టింది.