
ఆధార్ ఇంపార్టెన్స్ ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది. ఏదైనా అప్లై చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా.. నువ్వు ఎవరో చెప్పాలంటే ఆధార్ తప్పనిసరి. ఓటర్ ఐడీ, పాన్ కార్డు.. ఇలా గుర్తింపు కార్డులు ఎన్ని ఉన్నా.. అన్నింటికీ ఆధారం.. ఆధార్ కార్డే. అయితే ఆధార్ ఎన్రోల్ చేసినప్పుడు అందులో ఎన్నో మిస్టేక్స్ వచ్చి ఉంటాయి. అయినా దాంతో ఏం అవసరం ఉందిలే అని కొందరు కొనసాగిస్తుంటారు. కానీ ఏదైనా అప్లికేషన్, రిజిస్ట్రేషన్ మొదలైన సందర్భాలలో మిస్టేక్స్ ఉంటే చాలా సమస్యలు వస్తుంటాయి.
అందుకోసం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాల్సిందిగా అవకాశం కల్పించారు. ఆధార్ లో తప్పులు సరిచేసుకోవడానికి ఇన్నాళ్లు ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత సర్వీసులు అందుబాటులో ఉండేవి. కానీ త్వరలో ఆ సదుపాయం ఉండదని ప్రకటించింది ఆధార్ రెగ్యులేటరీ సంస్థ (UIDAI).
ఈ ఏడాది అంటే 2025 జూన్ 14 తర్వాత ఆధార్ ఫ్రీ అప్ డేట్ సర్వీసులు ఉండవు. 14 తేదీ తర్వాత ఏదైనా కరెక్షన్ ఉంటే.. ఫీజు కట్టాల్సిందే. 2016 ఆధార్ ఎన్రోల్ మెంట్, రెగ్యులేషన్- లో భాగంగా జూన్ 14 తర్వాత ఆ గడువు ముగుస్తుందని ప్రకటించింది. ఆ తర్వాత ప్రతి అప్ డేట్ కు రూ.50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత కచ్చితంగా ఆధార్ సెంటర్ లో ఫీ చెల్లించి అప్ డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
గడువు లోపు ఆన్ లైన్ లో myAadhaar portal ద్వారా ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు. లేదంటే ఆధార్ సెంటర్ కు వెళ్లి ఫ్రీగా చేంజ్ చేయించవచ్చు. పేరు, పుట్టినతేదీ, అడ్రెస్, జెండర్, భాషా మొదలైన మార్పులు ప్రస్తుతం ఉచితంగా చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్ కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చు.
జూన్ 14 లోపు ఆన్ లైన్ లో ఇలా అప్ డేట్ చేసుకోండి:
ప్రస్తుతం ఫ్రీ అప్ డేట్ సర్వీసెస్ అందుబాటులో ఉంది గనక.. ఆధార్ పోర్టల్ లో లాగిన్ అయ్యి మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చు. https://myaadhaar.uidai.gov.in అనే ఆధార్ పోర్టల్ లో ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దాని కింద ఇచ్చిన క్యాపిచా ఎంటర్ చేస్తే లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. లాగిన్ అయిన తర్వాత అడ్రెస్ ప్రూఫ్, ఐడెంటిటీ సరైనదేనని అప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది .ఆ తర్వాత ‘‘డాక్యుమెంట్ అప్ డేట్’’ (Document Update) సెలెక్ట్ చేసుకుని కావాల్సిన ఫైల్స్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ పూర్తైన తర్వాత సర్వీస్ రెక్వెస్ట్ నెంబర్ (SRN) వస్తుంది. ఈ నెంబర్ తో అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేసుకోవచ్చు.
అప్ డేట్ కోసం సింపుల్ స్టెప్స్:
https://myaadhaar.uidai.gov.in అనే పోర్టల్ లాగిన్ అవ్వాలి>> ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి >> కింద ఉన్న క్యాపిచా ఎంటర్ చేయాలి >> మొబైల్ కు వచ్చిన OTP ఎంటర్ చేయాలి >> డాక్యుమెంట్ అప్ డేట్ (Document Update) ఆప్షన్ ఎంచుకోవాలి >> నేమ్, అడ్రస్, కరెక్షన్ చేసుకోవాలి >> సప్పోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి .
అయితే ఇప్పటివరకు ఆధార్ ఫ్రీ అప్ డేట్ సదుపాయం కల్పించారు. దీనికి కారణం.. అన్నింటికీ కీలకమైన ఆధార్ లో ఎలాంటి తప్పులు ఉండకూడదని.. అందుకోసం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకునే సదుపాయం కార్డ్ హోల్డర్స్ కు కల్పించేలా ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. కానీ ఇక నుంచి కొంత ఫీజు చెల్లించి అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ మీ ఆధార్ లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే గడువు లోపు అప్ డేట్ చేసుకోవడం బెటర్.