ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి

ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
  • అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్: తెలంగాణలో 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు చేసిన ప్రకటనను అసెంబ్లీ వేదికగా స్వాగతించారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. నిరుపేదలు, సామాన్యులకు భారం తగ్గించేందుకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఖాళీ పోస్టుల భర్తీపై సర్కారు ప్రకటన చేయటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ అవసరం ఎంతో ఉందన్నారు. ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం ఉర్దూ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ముస్లిం అభ్యర్థులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ పాత బస్తీలో స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు.

మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి చాలా కాలంగా దరఖాస్తులు క్లియర్ కాలేదు..ఆర్ధిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు, సీఎం స్వయంగా బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. అలాగే దర్గాలలో నిర్వహణకు నిధులు కూడా ఇవ్వడం లేదు. షాదీ ఖానాలు అసంపూర్తిగా నిలిచిపోయిన చోట వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. రోడ్డు విస్తరణ పూర్తి చేసేందుకు ప్రభుత్వం 200 కోట్లు ఇవ్వాలని.. రోడ్డు విస్తరణ బాధితులకు పరిహారం వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాతబస్తీలో ఉస్మానియా ఆస్పత్రి గురించి పట్టించుకోవాలని.. శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో మహేశ్వరం వద్ద ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. 
 

 

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ ఓ సూపర్ కంప్యూటర్.. చరణ్ నన్ను ఆశ్చర్యపరిచాడు

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్