అనాథలకు ఉచితంగా కార్పొరేట్ విద్య .. తలకొండపల్లి ఎక్స్ రోడ్ లో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్

అనాథలకు ఉచితంగా కార్పొరేట్ విద్య .. తలకొండపల్లి ఎక్స్ రోడ్ లో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్

ఆమనగల్లు, వెలుగు: అనాథ పిల్లలకు వరం ఉచిత  ఆశ్రమ పాఠశాల, కళాశాల అని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం తలకొండపల్లి ఎక్స్ రోడ్ లో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్​ స్థాపించిన అనాథ పిల్లల ఉచిత ఆశ్రమ పాఠశాల, కళాశాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్ కళాశాలలో చదువలేని పేద విద్యార్థులకు ఈ సంస్థతో మేలు కలుగుతోందన్నారు. 

బాలికల విద్యాభివృద్ధి కోసం వెంకటేశ్​ ఉచిత ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్ పర్సన్ రజిని సాయిచంద్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, శేషారెడ్డి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు  పాల్గొన్నారు.