
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెల 18న పలు సంస్థల ఆధ్వర్యంలో రాజ్ భవన్ పక్కనున్న సాంస్కృతిక భవన్ లో దివ్యాంగులకు ఉచిత హెల్త్ క్యాంపుతోపాటు ఉచిత సర్జరీలు నిర్వహించనున్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్, డిసేబుల్ ఫౌండేషన్ ట్రస్ట్, అగర్వాల్ సేవాదళ్ బద్రివిషెల్ పన్నాలాల్ పిట్టి ట్రస్ట్, మహావీర్ వికలాంగ్ సహాయత సమితి, రామ్‌దేవ్ రావు హాస్పిటల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ క్యాంపు నిర్వహిస్తున్నాయి. గురువారం దీనికి సంబంధించిన పోస్టర్ఆవిష్కరించారు. దివ్యాంగులకు ఆర్టిఫిషియల్అవయవాలు ఇవ్వడంతో పాటు అవసరమైనవారికి ఉచితంగా సర్జరీలు చేస్తారని, ఉచితంగా మందులు ఇస్తారని, ఇతర పరీక్షలతో పాటు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు కూడా ఫ్రీగా ఇస్తారన్నారు.