హైదరాబాద్, వెలుగు: 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టు ఆవరణలోని హోమియోపతి డిస్పెన్సరీలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ధన్వంతరి పూజతో శిబిరాన్ని ప్రారంభించారు. న్యాయమూర్తులు జస్టిస్ వి.రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ శిబిరాన్ని సందర్శించి వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. వైద్యులు, రిజిస్ట్రార్లు, డిస్పెన్సరీ సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో రక్త పరీక్షలు నిర్వహించి, ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ చేశారు.
