
ఖమ్మం, వెలుగు : ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో బుధవారం చిన్న పిల్లల కోసం ఉచితంగా గుండె సంబంధ సమస్యలపై క్యాంపు నిర్వహించారు. హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్స్ చిన్నపిల్లల గుండె జబ్బుల విభాగం వైద్య నిపుణులు ఐఎంఏ హాల్లో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది.
ఐఏపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో ఐఏపీ ఖమ్మం జిల్లా కమిటీ బాధ్యుడు డాక్టర్ భరత్ కుమార్, డాక్టర్ సాయి భార్గవ్ ఆధ్వర్యంలో ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్ కు చెందిన చిన్నారుల గుండె జబ్బుల వైద్య నిపుణులు డాక్టర్ చిన్న స్వామి రెడ్డి, డాక్టర్ లింగస్వామి ఆధ్వర్యంలో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది గుండె సమస్యలు ఉన్న చిన్నారులు క్యాంపులో పాల్గొన్నారు.